- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ అలర్ట్.. ఏపీపీఎస్సీ జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఎంపిక జాబితా విడుదల
జూనియర్, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల ఎంపిక జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఆంగ్లం, గణితం సహా 5 సబ్జెక్టుల్లో 17 మంది జేఎల్ అభ్యర్థులు, 10 పాలిటెక్నిక్ సబ్జెక్టుల్లో 25 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారికంగా విడుదల చేసింది. ఆంగ్లం, సంస్కృతం, గణితం, జంతుశాస్త్రం, చరిత్ర సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 17 మంది అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 2023 డిసెంబర్ 28న విడుదల చేసిన నోటిఫికేషన్ (నెం: 16/2023) ప్రకారం మొత్తం 47 పోస్టులకు గాను ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆరు సబ్జెక్టుల ఫలితాలను కమిషన్ పెండింగ్‌లో పెట్టింది. ముఖ్యంగా కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో (CPT) అనుత్తీర్ణులు కావడం, నిర్ణీత విద్యార్హతలు లేకపోవడం, ఉర్దూ పోస్టులకు తగిన సంఖ్యలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫలితాలు విడుదలైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ ఫైళ్లను కమిషన్ వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా కమిషన్ విడుదల చేయడం విశేషం. మొత్తం 10 సబ్జెక్టులకు సంబంధించి 25 మంది అభ్యర్థులను తుది ఎంపికకు ఎంపిక చేస్తూ వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. చాలా కాలంగా నియామకాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఈ ఫలితాల విడుదల ఒక ఊరట గా నిలిచింది. ఎంపికైన అభ్యర్థులు తదుపరి నియామక ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.






