- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోక్‌సభలో 2026 ఆర్థిక బిల్లు ఆమోదం.. బడ్జెట్ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తి
by Malleboina Mahesh |
లోక్‌సభలో 2026 ఆర్థిక బిల్లు పాస్! 32 సవరణలతో ఆమోదించిన సభ. తదుపరి పరిశీలన కోసం రాజ్యసభకు బిల్లు. బడ్జెట్ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తి.

X
దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో 2026 ఆర్థిక బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్‌సభ 2026 ఆర్థిక బిల్లును (Finance Bill 2026) విజయవంతంగా ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 32 సవరణలతో కూడిన ఈ బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో, బడ్జెట్ ఆమోద ప్రక్రియలో లోక్‌సభకు సంబంధించిన కీలక భాగం పూర్తయినట్లయ్యింది. ఇక ఈ బిల్లు తదుపరి పరిశీలన కోసం ఎగువ సభ అయిన రాజ్యసభకు వెళ్లనుంది. రాజ్యసభ కూడా ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి బడ్జెట్ ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. దేశ ఆర్థిక విధానాలు, పన్నుల రూపకల్పనలో ఈ బిల్లు ఆమోదం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story






