- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపోలో ఆసుపత్రులకు రూ.17.76 కోట్ల భారీ జరిమానా
ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ గ్రూప్ 'అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్'కు రూ.17.76 కోట్ల భారీ జరిమానా విధించబడింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ గ్రూప్ 'అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్'కు రూ.17.76 కోట్ల భారీ జరిమానా విధించబడింది. విదేశీ మారక నియంత్రణ చట్టం(FEMA) ఉల్లంఘనల ఆరోపణల కేసులో RBI నిబంధనల ప్రకారం అపోలో హాస్పిటల్స్ భారీగా పెనాల్టీ చెల్లించి ఈ కేసును రాజీ చేసుకుంది. ఇందులో భాగంగా అపోలో సంస్థ, అలాగే ఆ సంస్థకు చెందిన ఐదుగురు కీలక డైరెక్టర్లకు కలిపి మొత్తం రూ.17.76 కోట్లకు పైగా జరిమానాగా విధించారు. ఈ ఒప్పందంలో భాగంగా అపోలో హాస్పిటల్స్ సంస్థ 17.76 కోట్ల జరిమానా చెల్లించి, కేసు నుంచి విముక్తి పొందనుంది. సంస్థతో పాటు విడిగా బాధ్యులైన ఐదుగురు టాప్ డైరెక్టర్లు మరియు అధికారులు ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి, ఎస్.కె. వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్.ఎం. కృష్ణన్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరు రూ.18 లక్షల చొప్పున జరిమానా మొత్తాన్ని చెల్లించనున్నారు.
కేసు పూర్వాపరాలు
అసలు ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే... అపోలో హాస్పిటల్స్ సంస్థ విదేశీ పెట్టుబడుల స్వీకరణ, షేర్‌హోల్డింగ్, మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిబంధనల ఉల్లంఘనల విలువ మొత్తం సుమారు రూ.2,424 కోట్లుగా అంచనా వేశారు. సాధారణంగా ఇటువంటి కేసుల్లో సుదీర్ఘ కాలం పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా, తప్పులను అంగీకరిస్తూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం కాంపౌండింగ్ ఫీజు చెల్లించి కేసులను ముగించుకునే సదుపాయం ఉంటుంది. అపోలో సంస్థ కూడా అదే మార్గాన్ని ఎంచుకుని ఈ భారీ జరిమానా చెల్లించడంతో ఈ వివాదానికి శాశ్వతంగా చెక్ పడింది.






