- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. విద్యుత్ చార్జీల పెంపునకు నో చెప్పిన సర్కార్!
ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరగవు! FY27లో ప్రజలపై ట్రూఅప్ భారం పడకుండా ₹15,790 కోట్ల లోటును ప్రభుత్వమే భరించనుంది. 1.30కోట్ల గృహాలకు ఊరట.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారుల (Electricity consumers) పై ఎటువంటి ప్రభావం పడకూడదని ఏపీ సర్కార్ (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 (FY27) ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను (Electricity charges) పెంచకూడదని, అలాగే పాత బకాయిల పేరుతో ప్రజలపై 'ట్రూఅప్' భారాలను వేయకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి (APERC) ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసినట్లు సమాచారం. విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్‌లకు ఏర్పడే సుమారు ₹15,790 కోట్ల రెవెన్యూ లోటును ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తుందని. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.30 కోట్ల గృహ విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని తెలుస్తుంది.
మరోవైపు, సంక్షేమ పథకాల్లో భాగంగా అందుతున్న రాయితీలు యథావిధిగా కొనసాగనున్నాయి. సుమారు 22 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్, అలాగే 22 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల కుటుంబాలకు రాయితీ విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వం పొడిగించింది. ముఖ్యంగా వాణిజ్య వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తూ, యూనిట్ ధరకు ₹12.25 నుంచి ₹9.95కు తగ్గించింది. దీనివల్ల రాష్ట్రంలోని 2 లక్షల మంది చిన్న, మధ్యతరహా వ్యాపార వేత్తలకు లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.






