- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగాల్ సీఎం సువేందు అధికారికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
స్వతంత్ర భారత దేశంలో మొదటిసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారికి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి (Suvendu Adhikari)కి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan) హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ విజయం కేవలం బీజేపీదే కాదని, భారత ప్రజల విజయమని ఆయన కొనియాడారు. ఏళ్ల తరబడి పోరాడి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చారిత్రక విజయాన్ని అందుకున్న బెంగాల్ బీజేపీ నాయకత్వాన్ని, కార్యకర్తలను పవన్ ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రంలో పారదర్శకమైన, ప్రజల కేంద్రీకృత పాలన సాగాలని ఆయన ఆకాంక్షించారు.
పశ్చిమ బెంగాల్‌లో గత కొంతకాలంగా నెలకొన్న హింస, అరాచకం, అక్రమ వలసలు, తీవ్రవాద చొరబాట్లు జాతీయ భద్రతకు సవాలుగా మారాయని, ఈ తాజా తీర్పు ఆ సవాళ్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు ఆయన జన్మస్థలమైన బెంగాల్‌లో లభించిన ఈ విజయం ఒక గొప్ప నివాళి అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమని చెబుతూ.. అమిత్ షా, నితిన్ నబిన్, సమిక్ భట్టాచార్యలకు బీజేపీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.






