అమరావతిపై ఏపీ అసెంబ్లీ చారిత్రక తీర్మానం.. ఈ నెల 28న ప్రత్యేక సమావేశం!

by Malleboina Mahesh |

ఏపీ రాజధానిగా అమరావతి! ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం. పార్లమెంటుకు పంపనున్న ప్రభుత్వం. రాజధాని సందిగ్ధతకు ముగింపు పలికేలా కూటమి ప్రణాళిక.

అమరావతిపై ఏపీ అసెంబ్లీ చారిత్రక తీర్మానం.. ఈ నెల 28న ప్రత్యేక సమావేశం!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (AP Assembly special meeting) నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి (Amaravati)ని ఖరారు చేస్తూ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్మానం చేయనుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు తెర దించుతూ, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం, ఈ అధికారిక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంటుకు పంపించాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి కూటమిలోని సభ్యులందరూ (TDP, జనసేన, BJP) తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ నిర్ణయం ద్వారా అమరావతి నిర్మాణ పనులకు మరింత వేగం వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక సమావేశం ద్వారా అమరావతి విషయంలో నెలకొన్న న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story