మహిళలకు గుడ్ న్యూస్.. కేసీఆర్​పేరిట మరో స్కీం

by Disha Web Desk |
మహిళలకు గుడ్ న్యూస్.. కేసీఆర్​పేరిట మరో స్కీం
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కేసీఆర్​ పేరిట మరో స్కీం రానున్నది. త్వరలో 'కేసీఆర్ న్యూట్రీషియన్​ కిట్'​ పేరిట గర్భిణీలకు అందజేయనున్నారు. ఈ కిట్‌లో​పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందివ్వనున్నారు. ప్రతీ ఏటా లక్షా 25 వేల మంది గర్భిణీలకు ఈ కిట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని వలన గర్భిణీలు, బాలింతలలో రక్తహీనత సమస్య లోపాన్ని నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకీ రక్తహీనత సమస్య పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్​, భద్రాచలం, కొత్తగూడెం, జయశంకర్​భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్, ములుగు, జోగులాంబ, గద్వాల, నాగర్​ కర్నూల్​జిల్లాల్లో ని గర్భిణీలు అత్యధికంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు స్వయంగా ప్రభుత్వ సర్వేలోనే తేలింది.

ఆరోగ్య సమస్యలు....

గర్భిణీలు సరైన పోషకాహారం అందకపోవడంతో చాలా మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. కొన్ని సందర్భాల్లో తల్లి, బిడ్డా ఇద్దరూ హెల్త్​ ప్రాబ్లమ్స్‌ ను ఎదుర్కొంటున్నారు. అంతేగాక డెలివరీ సమయంలో చిక్కులు ఏర్పడుతున్నాయి. పౌష్టిహాకారం పొందకపోవడం వలన సీజేరియన్ల శాతం కూడా పెరిగింది. దీంతో ఈ కిట్ల ద్వారా గర్భిణీలకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వనున్నారు. దీని ద్వారా క్రమంగా సాధారణ ప్రసవాలు జరిగేలా సర్కార్​ ప్రోత్సహించనున్నది.

Next Story

Most Viewed