కల్తీపాల ఘటనలో మరొకరు మృతి

by Muthe.Rajitha |

రాజమండ్రి కల్తీపాల ఘటనలో మరొకరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 9 కి చేరింది.

కల్తీపాల ఘటనలో మరొకరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఉదంతం రోజురోజుకి అత్యంత విషాదకరమైన మలుపులు తీసుకుంటోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9 కి చేరింది. తాజాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో బాధితుడు శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందటంతో ఈ మరణాల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఈ విషాదంలో పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఈ కల్తీ పాల ప్రభావానికి గురికావడం వల్ల మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది.

ప్రస్తుతం వివిధ రాజమండ్రి, వైజాగ్ లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 11 మంది బాధితులు మృత్యువుతో పోరాడుతున్నారు. వీరిలో సుమారు ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని వైద్యులు పేర్కొన్నారు. ఈ కల్తీ పాలు సేవించిన వారిలో ప్రధానంగా అక్యూట్ రెనల్ ఫెయిల్యూర్, అనూరియా వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. పాల శీతలీకరణ సమయంలో లీకైన విషపూరిత రసాయనాల వల్ల బాధితుల అంతర్గత అవయవాలు, ముఖ్యంగా మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.

Next Story