- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసు శాఖలో మరో కీలక పరిణామం.. భారీ ఎత్తున ఐపీఎస్‌ల బదిలీలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం నాలుగు కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటైన జోన్లకు పలువురు డీసీపీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావు (CS Ramakrishna Rao) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చేవెళ్ల జోన్ డీసీపీగా యోగేష్ గౌతం, కూకట్‌పల్లి జోన్ డీసీపీగా రీతి రాజ్, శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని శ్రీనివాస్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీగా శ్రీనివాస్, ఉప్పల్ జోన్ డీసీపీగా సురేశ్, సిద్దిపేట సీపీగా రష్మి పెరుమాళ్, హైదరాబాద్ ఎస్‌బీ జాయింట్ సీపీగా విజయ్ కుమార్, హైదరాబాద్ సౌంత్ రేంజ్ అడిషనల్ కమిషనర్‌గా తఫ్సీర్, హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ సీపీగా శ్వేత, కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీగా కోటిరెడ్డి, మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ రెడ్డి, సికింద్రాబాద్ జోన్ డీసీపీగా రక్షితా మూర్తి, చార్‌మినార్ జోన్ డీసీపీగా కిరణ్ ఖరే, ఎల్బీ నగర్ జోన్ డీసీపీగా అనురాధ, ఖైరతాబాద్ జోన్ డీపీగా శిల్పవల్లి, గోల్కొండ జోన్ డీసీపీగా చంద్రమోహన్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీగా రమణా రెడ్డి, శంషాబాద్ జోన్ డీసీపీగా రాజేశ్, షాద్‌నగర్ జోన్ డీసీపీగా శిరీష నియమితులయ్యారు.






