- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజాపూర్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
ఆపరేషన్ కగార్ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నక్సలైట్లు నేరుగా పోలీసులకు లొంగిపోతున్న విషయం తెలిసిందే 2026 మార్చి 30 వరకు నక్సల్ రహిత దేశంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ కగార్ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నక్సలైట్లు నేరుగా పోలీసులకు లొంగిపోతున్న విషయం తెలిసిందే 2026 మార్చి 30 వరకు నక్సల్ రహిత దేశంగా ముందుకు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు కుంబింగ్ చేస్తుండగా నక్సల్స్ కనిపించారు. దీంతో భద్రతా దళాలు, నక్సలైట్ల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు అధికారుల తెలిపారు. అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలపై అందిన పక్కా సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన గాలింపు చర్యలు సమయంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
భారీగా ఆయుధాలు స్వాధీనం
ఈ ఎన్ కౌంటర్ తర్వాత మరణించిన ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో అత్యాధునిక AK-47 రైఫిల్, ఒక 9mm పిస్టల్, భారీ ఎత్తున విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. అడవిలో ఇంకా నక్సలైట్లు దాగి ఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌ను, ముమ్మరం చేశాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.






