- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడిపోయిన బెంగాల్, తమిళనాడు సీఎంలకు మరో ఛాన్స్.. ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు
తమిళనాడు, బెంగాల్‌లలో ఉపఎన్నికల సందడి మొదలవ్వనుంది. విజయ్, సువేందు అధికారి రాజీనామా చేసే స్థానాల నుండి స్టాలిన్, మమతా బెనర్జీ పోటీ చేసి ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశం ఉంది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి, బెంగాల్, తమిళనాడు సీఎంలు ఓడిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే వారు సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మరో అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో అనూహ్యమైన రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ (Vijay) రెండు స్థానాల్లో ఘనవిజయం సాధించడంతో, నిబంధనల ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంలో టీవీకే తరఫున సినీ నటి త్రిషను (Film actress Trisha) బరిలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అక్కడ డీఎంకే అభ్యర్థిగా మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ (M.K. Stalin) పోటీ చేసి విజయం సాధిస్తే, ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం ఉంది.
త్రిష వంటి పాపులర్ స్టార్‌ను ఓడించడం ద్వారా స్టాలిన్ తన రాజకీయ పట్టును నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇటు పశ్చిమ బెంగాల్‌లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బీజేపీ నేత సువేందు అధికారి (Suvendu officer)తో పాటు మరో బీజేపీ అనుకూల ముస్లిం నాయకుడు కూడా రెండు స్థానాల్లో విజయం సాధించారు. వీరు ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి రావడంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మాజీ సీఎం మమతా బెనర్జీ (Former CM Mamata Banerjee) ఉప ఎన్నికల బరిలో నిలిచి, గెలుపు ద్వారా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను దక్కించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఓటమి పాలైన మాజీ ముఖ్యమంత్రులకు ఈ ఉప ఎన్నికలు ఒక రాజకీయ పునర్జన్మల మారతాయా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.






