ఓ రేంజ్‌లో గిఫ్ట్ ఇస్తారనుకుంటే.. ఏకంగా రేంజ్ రోవరే ఇచ్చారు: అనిల్ రావిపూడి

by Gantepaka Srikanth |

మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది.

ఓ రేంజ్‌లో గిఫ్ట్ ఇస్తారనుకుంటే.. ఏకంగా రేంజ్ రోవరే ఇచ్చారు: అనిల్ రావిపూడి
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదలై, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. తాజాగా ఈ చిత్ర సక్సెస్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడారు. ‘ఇవాళ పొద్దున చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఓసారి ఇంటికి రా అని పిలిచారు. ఈవినింగ్ ఫంక్షన్ ఉంది దాని గురించి ఏమో అనుకుని వెళ్లాను. గతంలోనే చెప్పారు. నాకు గిఫ్ట్ ఇస్తాను అని.. చిరంజీవి గారు కాబట్టి.. ఓ రేంజ్‌లో గిఫ్ట్ ఉంటుందనుకుంటే.. ఏకంగా రేంజ్ రోవరే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనిని నేను గిఫ్ట్‌గా చూడటం లేదు. ఆయనకు నామీద ఉన్న ప్రేమగా చూస్తున్నాను’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఇప్పటికే 300 కోట్లు వసూలు చేసి.. 350 కోట్ల దిశగా అడుగులేస్తుంది. ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లోనూ మెగా-విక్టరీ జోడి సందడి చేసింది.

Next Story