- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మాయిగా మారిన భారత మాజీ క్రికెటర్ కుమారుడు.. బ్యాంకాక్‌లో 'వాజినోప్లాస్టీ' శస్త్రచికిత్స
"మార్చిలో అనయ బంగర్ కీలక శస్త్రచికిత్స! లింగ మార్పిడి ప్రక్రియలో భాగంగా బ్యాంకాక్‌లో వాజినోప్లాస్టీ చేయించుకోనున్నట్లు సంజయ్ బంగర్ కుమార్తె వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు అమ్యాయిగా మారుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT) తీసుకుంటున్న అనయ బంగర్(ఆర్యన్ బంగర్), తన శరీరంలో వస్తున్న మార్పులను ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమె మార్చి 14న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో 'వాజినోప్లాస్టీ' (Vaginoplasty) శస్త్రచికిత్స చేయించుకోబోతున్నారు. ఈ ఆపరేషన్ ద్వారా పురుషాంగం స్థానంలో వెజైనాను ఏర్పాటు చేస్తారని, దీని కోసం ఆమె దాదాపు ఐదేళ్లుగా నిరీక్షిస్తున్నానని అత్యంత భావోద్వేగంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
రికవరీ ప్రక్రియ.. ఖర్చు వివరాలు
సాధరణంగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తర్వాత ఒక పురుషుడు పూర్తిగా స్త్రీగా మారడానాకి హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేస్తారు. ఈ శస్త్రచికిత్స అనంతరం అనయ కనీసం ఒక నెల పాటు బ్యాంకాక్‌లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని, ఈ సమయంలో ఆమె ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదని వైద్యులు సూచించారు. అలాగే ప్రతి ఏటా క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేయించుకోవడం తప్పనిసరి. ఈ ఆపరేషన్, ఇతర వైద్య ఖర్చుల కోసం రూ. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని, ఈ మొత్తాన్ని తన తండ్రి సంజయ్ బంగర్ భరిస్తున్నారని ఆమె తెలిపారు.
భవిష్యత్తు ప్రణాళికలు.. సవాళ్లు
అనయ తన పరివర్తన ప్రక్రియకు ముందే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తన స్పెర్మ్‌ను ఫ్రీజ్ చేయించుకున్నారు. తద్వారా సరోగసీ ద్వారా తల్లి అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. మరోవైపు, ఆమె గతంలో క్రికెటర్‌గా రాణించినప్పటికీ, హార్మోన్ మార్పుల కారణంగా కండరాల బలం తగ్గిందని, దీంతో క్రీడల్లో కొనసాగడం సవాలుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, ట్రాన్స్‌జెండర్ క్రీడాకారిణిగా మహిళల క్రికెట్‌లో ఆడే అవకాశం కోసం ఆమె ఐసీసీ (ICC) నిబంధనల మార్పును కోరుతున్నారు.






