- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, సినిమా: హీరో ఇషాన్ ఖట్టర్‌తో డేటింగ్‌లో ఉందన్న వార్తలపై స్పందించింది బ్యూటిఫుల్ అనన్యా పాండే. తాజాగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడిన ఆమె.. ఒంటరిగా మాత్రం లేనని స్పష్టం చేసింది. అయితే విలేఖర్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చేందుకు ఇష్టపడని అనన్య.. చివరకు తనతో సంతోషంగా ఉన్నానంటూ లవ్ ఎఫైర్ నిజాన్ని బయటపెట్టింది. అంతేకాదు తనకు ఇష్టమైన సహనటుడు కూడా ఇషాన్ ఖట్టర్ అని చెప్పిన నటి.. మిగతా నటులను కూడా లైక్ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. ఇక 'ఖాలీ పీలీ' చిత్రంతో కలిసిన వీరిద్దరూ అప్పటి నుంచే ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కాగా అనన్య నటించిన 'గెహ్రాయియా' ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోగా.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన 'లైగర్'లో నటిస్తోంది.
Next Story






