- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెలరోజులుగా ఎస్సై లేక అనంతగిరి పోలీస్ స్టేషన్
కోదాడ ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కీలక మండలంగా ఉన్న అనంతగిరి పోలీస్ స్టేషన్‌లో నెలరోజులుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

దిశ, అనంతగిరి : కోదాడ ఆంధ్ర–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కీలక మండలంగా ఉన్న అనంతగిరి పోలీస్ స్టేషన్‌లో నెలరోజులుగా ఎస్సై పోస్టు ఖాళీగా ఉండటం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్సై బదిలీ పై వెళ్లి నెలరోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కొత్త అధికారిని నియమించకపోవడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనంతగిరి మండలంలో జనాభా పెరుగుతుండటంతో పాటు భూ వివాదాలు, కుటుంబ కలహాలు, రోడ్డు ప్రమాదాలు, శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు కూడా పెరుగుతున్నాయి. నిత్యం ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వస్తున్నప్పటికీ పూర్తిస్థాయి అధికారి లేకపోవడం వల్ల కేసుల పరిష్కారం, ఫిర్యాదుల విచారణ ఆలస్యమవుతోందని స్థానికులు చెబుతున్నారు.
అంతేకాకుండా అనంతగిరి మండలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో పాటు ఖమ్మం జిల్లా సరిహద్దును ఆనుకుని ఉండడం వల్ల అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల పై నిఘా అవసరం మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో స్టేషన్‌కు శాశ్వత ఎస్సై లేకపోవడం శాంతిభద్రతల పరిరక్షణ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు సమాచారం అందించేందుకు క్రైమ్ సంబంధిత వార్తలు కూడా మీడియాకు అందటం లేదు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అనంతగిరి పోలీస్ స్టేషన్‌కు పూర్తి స్థాయి ఎస్సైని నియమించాలని, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.






