- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైనర్‌ను ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. NH 65పై 4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ఖైతాపురం వద్ద ఇవాళ ఉదయం ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను ఆయిల్ ట్యాంకర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆయిల్ ట్యాంకర్ ముందు క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ బయటకు రాలేక, స్టీరింగ్ క్యాబిన్ ఇనుప భాగాల మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు సుమారు అరగంటకు పైగా శ్రమించారు. గ్యాస్ కట్టర్లు, ఇతర పరికరాల సహాయంతో క్యాబిన్ భాగాలను కట్ చేసి డ్రైవర్‌ను క్షేమంగా బయటకు తీయగలిగారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
4 కి.మీ మేర ట్రాఫిక్ జామ్..
రోడ్డు ప్రమాదం కారణంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైవేపై సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనిలో ఉన్నారు.






