భూషణ్ కుమార్‌తో ఎఫైర్? నోరా ఫతేహి షాకింగ్ రియాక్షన్.. ఒక్క ఎమోజీతో నోళ్లు మూయించిందిగా

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-18 07:34:05  IST  )

బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి(Nora Fatehi), టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan Kumar)మధ్య ఏదో ఉందంటూ గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

భూషణ్ కుమార్‌తో ఎఫైర్? నోరా ఫతేహి షాకింగ్ రియాక్షన్.. ఒక్క ఎమోజీతో నోళ్లు మూయించిందిగా
X

దిశ, సినిమా: బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి(Nora Fatehi), టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ (Bhushan Kumar)మధ్య ఏదో ఉందంటూ గత ఐదేళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రెడిట్ వేదికగా వీరిద్దరి అఫైర్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. తాజాగా ఈ రూమర్లు మళ్ళీ వైరల్ అవ్వడంతో నోరా ఫతేహి ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలకు ఆమె సమాధానం ఇచ్చి నెటిజన్లను ఆశ్చర్యపరిచారు. నిజానికి గతంలో వచ్చిన ఒక పోస్ట్‌లో.. నోరా ఫతేహి మెయింటైన్ చేసే ఖరీదైన లైఫ్ స్టైల్, లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బ్యాగ్స్ వెనుక భూషణ్ కుమార్ ఉన్నారని. అందుకే ఆమెకు టీ-సిరీస్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయని కొందరు ఆరోపించారు.

ఇప్పుడు ఈ వీడియో కింద నోరా స్పందిస్తూ.. ‘Wow’ అని రాసి ఒక నవ్వుతున్న ఎమోజీని జత చేసింది. అంటే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవి కేవలం రూమర్ అని ఆమె పరోక్షంగా కొట్టిపారేశారు. అయితే, నోరా చేసిన ఈ కామెంట్ ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చకు దారితీసింది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా, నోరా రియాక్షన్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇటీవల నోరా ఫతేహి ఫుల్ బాల్ స్టార్ అచ్రఫ్ హకిమితో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయనప్పటికీ నిత్యం ఎఫైర్లతో వార్తల్లో నిలుస్తోంది.

Next Story