- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్‌లోకి అడుగుపెట్టిన అమెరికా లెర్నింగ్ ప్లాట్‌ఫాం ఎస్ఈడీ
భారత్‌లోకి అడుగుపెట్టిన అమెరికా విద్యా విశ్లేషణ సంస్థ SED! శ్రీ చైతన్య విద్యా సంస్థలతో ఒప్పందం. న్యూరోసైన్స్ ఆధారంగా విద్యార్థుల మేధో సామర్థ్యాలను విశ్లేషించే సరికొత్త ప్లాట్‌ఫాం ప్రారంభం.

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యా విశ్లేషణ సంస్థ స్టూడెంట్ ఎడ్యుకేషన్ డయాగ్నస్టిక్స్ (ఎస్ఈడీ) తన వినూత్న న్యూరోసైన్స్ ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాంను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనేష్. వి తెలిపారు. ఎస్ఈడీ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఎస్ఈడీ, శ్రీచైతన్య సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఫ్రేమ్ కాపీని ప్రతినిధులు మీడియా సమక్షంలో మార్చుకున్నారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మార్చి 17న ఢిల్లీలో మొదటి లాంచ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎస్ఈడీ ప్లాట్ ఫాం సంప్రదాయ మూల్యాంకన పద్దతులకు భిన్నంగా ఉంటుందన్నారు.
విద్యార్థుల సహజ తెలివితేటలు, న్యూరోసైన్స్ సిద్దాంతాల ఆధారంగా మానసిక స్థాయిలను విశ్లేషించి ఆ మేరకు వారి అభివ్రుద్దికి మార్గాలు రూపొందిస్తామని తెలిపారు. విద్యార్థులు సమాచారాన్ని ఎలా గ్రహిస్తున్నారు, ఎలా ఉపయోగించుకుంటున్నారు అని ఈ విధానంలో విశ్లేషిస్తామని వివరించారు. ఎస్ఈడీ సీఈఓ అష్లీ సంబాలుక్ మాట్లాడుతూ ఈ విధానం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ అకడమిక్ డైరెక్టర్ సీమ బొప్పన మాట్లాడుతూ ఎస్ఈడీ తో భాగస్వామ్యం పై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యాసాన్ని శాస్త్రీయ డేటా ఆధారిత విధానాలతో మార్పు తీసుకురావడంతో ఇది కీలక అడుగని వివరించారు. మార్చి 19న ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. మరింత సమాచారం కోసం www.usaeducationdiagnostics.com సందర్శించవచ్చు లేదా +91 94402 38858 నంబర్‌ను సంప్రదించవచ్చు.






