- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలీవుడ్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్.. అధికారిక ప్రకటనతో భారీ హైప్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో సినిమా ఖరారైంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ పని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జులైలో ప్రారంభమై, అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం AA-23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ, భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే కాంబినేషన్‌లో రాబోతుందని మేకర్స్ తెలిపారు. అంతేకాదు, “గొప్పగా మారేందుకు కృషి చేయు” అనే క్యాప్షన్‌తో విడుదలైన వీడియో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్. ఈ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో, హై యాక్షన్ ఎపిసోడ్స్, హాలీవుడ్ స్థాయి VFXతో పాటు ఫ్రెష్ నరేటివ్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్నట్లు టాక్. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






