Allu Arjun-Kajal Aggarwal: అందులో టాప్ లిస్ట్ లో నిలిచి ఇమేజ్ పెంచుకున్న అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్

by Disha Web |
Allu Arjun, Kajal Aggarwal were the top most searched South Indian actors on Google
X

దిశ, సినిమా: Allu Arjun, Kajal Aggarwal were the top most searched South Indian actors on Google| 2021 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సెలబ్రిటీల జాబితా విడుదలైంది. ఈ క్రమంలోనే సినిమా సినిమాకు ఇమేజ్‌ను పెంచుకుంటున్న బన్నీ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. లాస్ట్ ఇయర్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన సౌత్ ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టేశాడు.

ఇక హీరోయిన్లలో సౌత్‌ నుంచి కాజల్‌ అగర్వాల్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో సమంత, రష్మిక ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌, షారుఖ్ ఖాన్‌ టాప్‌లో ఉండగా.. హీరోయిన్లలో కత్రినా కైఫ్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రా వరుస​స్థానాల్లో నిలిచారు. దివంగత గాయని లతా మంగేష్కర్‌ 5వ స్థానంలో ఉన్నారు. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్‌ చేసిన సౌత్‌ స్టార్ల లిస్టులో అల్లు అర్జున్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో మహేష్‌బాబు నిలిచారు. ఇక, తమిళ స్టార్ హీరో సూర్య కోలీవుడ్‌ నటుల్లో అగ్ర స్థానంలో నిలిచాడు.


Next Story