Unstoppable Season 4: అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్.. బాలయ్యతో సందడి చేసిన ప్రోమో రిలీజ్..!

by Kodari Anjali |   (  Updated:2025-07-27 11:07:09  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు.

Unstoppable Season 4: అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్.. బాలయ్యతో సందడి చేసిన ప్రోమో రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈ హీరో పుష్ప రెండో భాగం షూటింగ్ బిజీలో ఉన్నాడు. పుష్ప-2 (Pushpa-2) కోసం బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం డిసెంబరు 5 వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. అయితే బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ సీజన్- 4 (Unstoppable Season-4) విజయవంతంగా రన్ అవుతోంది. ఇంతకుముందు వచ్చిన మూడు సీజన్లు కూడా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గెస్టుగా హాజరయ్యారు. రెండో ఎపిసోడ్‌లో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) అతిథిగా హాజరై.. సందడి చేశాడు.

ఇకపోతే ప్రస్తుతం రన్ అవుతోన్న నాలుగో సీజన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా హాజరయ్యారు. పుష్ప-2 లో ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన బన్నీ బాలయ్య అన్‌స్టాపబుల్ షో లో చేసిన సందడికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. బన్నీ రాగానే మనిద్దరం బంధువులమని అనగా బాలయ్య అంటాడు. దీంతో ఎలాగని అడగ్గా.. నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని అంటాడు. దీంతో మీరు గీత ఇవ్వండి.. మేం కురుక్షేత్రం చేస్తామని ఐకాన్ స్టార్ చెబుతాడు.అనంతరం బన్నీకి పలువురి హీరోల ఫొటోలు చూపిస్తాడు. వీరందినీ చూస్తే ఏమనిపిస్తుంని అడుగుతాడు బాలయ్య. ఆ ఫొటోల్లో ఫస్ట్ చిరంజీవి(Chiranjeevi), సెకండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పిక్ చూపిస్తాడు. మరీ అల్లు అర్జున్ ఏ హీరో గురించి ఏమని చెబుతారో ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.

Video Link

Next Story