పశ్చిమ బెంగాల్‌లో కొత్త మంత్రివర్గ శాఖల కేటాయింపు

by Malleboina Mahesh |

పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వంలో మంత్రుల శాఖల కేటాయింపు పూర్తయింది. సీఎం సువేందు అధికారి హోం, ల్యాండ్ రిఫార్మ్స్ శాఖలను తీసుకున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో కొత్త మంత్రివర్గ శాఖల కేటాయింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. మరో 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో కొత్త మంత్రివర్గ శాఖల కేటాయిస్తు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 166 (3) ప్రకారం గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర కొత్త మంత్రివర్గంలో మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను హోమ్ అండ్ హిల్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ (కో-ఆర్డినేషన్ బ్రాంచ్) బుధవారం (జూన్ 10, 2026) అధికారిక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హోంశాఖను సీఎం సువేందు అధికారి తన వద్దే ఉంచుకున్నారు.

ముఖ్యమైన మంత్రులు - కేటాయించిన కీలక శాఖలు..

మొత్తం 19 మంది కేబినెట్ మంత్రులు, ముగ్గురు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు (MoS - Independent Charge), 19 మంది రాష్ట్ర మంత్రులతో కూడిన జాబితాలో ప్రధానంగా శాఖలు కేటాయించారు. సీఎం సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. అత్యంత కీలకమైన హోమ్ అండ్ హిల్ అఫైర్స్, ల్యాండ్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్, రెఫ్యూజీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, విద్యుత్, సమాచార-సాంస్కృతిక శాఖలు, పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌తో పాటు ఏ మంత్రికీ కేటాయించని ఇతర అన్ని ముఖ్య శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.

నిశిత్ ప్రమాణిక్ (Shri Nishith Pramanik): నార్త్ బెంగాల్ డెవలప్‌మెంట్, జలవనరుల దర్యాప్తు-అభివృద్ధి శాఖల బాధ్యతలను చేపట్టనున్నారు.

దిలీప్ ఘోష్ (Shri Dilip Ghosh): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అగ్రికల్చర్ మార్కెటింగ్ శాఖల బాధ్యతలను లీడ్ చేయనున్నారు.

స్వపన్ దాస్‌గుప్తా (Shri Swapan Dasgupta): అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ (Finance Department) బాధ్యతలు అందుకోనున్నారు.

అగ్నిమిత్ర పాల్ (Smt. Agnimitra Paul): పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఎంపికయ్యారు.




Next Story