- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత జట్టుకు మరో బిగ్ షాక్.. గాయం కారణంగా ఆల్ రౌండర్ సిరీస్ నుంచి అవుట్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరీస్ ప్రారంభంలోనే పంత్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. మరో ప్లేయర్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు.

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ (ODI series) జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరీస్ ప్రారంభంలోనే పంత్ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. మరో ప్లేయర్ గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ పక్కటెముకల గాయం కారణంగా మిగిలిన సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వడోదరా వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో అతనికి ఎడమ వైపు పక్కటెముకల భాగంలో (left lower rib) తీవ్ర అసౌకర్యం కలగడంతో అతను సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు.
ఈ మ్యాచ్‌లో సుందర్ 5 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చాడు, కానీ నొప్పి భరించలేక ఇన్నింగ్స్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయినప్పటికీ, జట్టు అవసరాల రీత్యా అతను నొప్పిని లెక్కచేయకుండా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి తన అంకితభావం చాటుకున్నాడు. చివరికి ఈ ఉత్కంఠ భరిత పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. కాగా సుందర్ స్థానంలో మరో ఆల్ రౌండర్ ను తీసుకునే అవకాశం కనిపిస్తుండగా.. దీనిపై బీసీసీఐ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.






