- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి : ఎస్పీ
by Batti.Sumithra |
ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో గల ఎమ్మార్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా - 2026 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామంలో గల ఎమ్మార్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 17న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా - 2026 కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. మంగళవారం ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ మహేందర్ జీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువత కోసం నిర్వహించనున్న మెగా జాబ్ మేళాకు యువత పెద్ద ఎత్తున హాజరు అయ్యే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భోజన వసతులు, నీటి వసతులు కల్పించాలని, అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీల వారీగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎస్పీ వెంట ములుగు డీఎస్పీ రవీందర్, ములుగు ఎమ్మార్వో విజయభాస్కర్, పస్ర సీఐ దయాకర్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Next Story






