- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రా బయటకు కనిపిస్తే తప్పేంటి.. లైంగిక వేధింపులపై నటి ఫైర్
by Chukka Sudharani |
దిశ, సినిమా : బాలీవుడ్ నటి అలియాభట్ ఇండ్రస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో సెక్సిజమ్ ఎదుర్కొన్నప్పటికీ ఆ మాటల తీవ్రత కొద్ది రోజుల వరకూ తెలియలేదన్న బ్యూటీ..

X
దిశ, సినిమా : బాలీవుడ్ నటి అలియాభట్ ఇండ్రస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కెరీర్ ప్రారంభంలో సెక్సిజమ్ ఎదుర్కొన్నప్పటికీ ఆ మాటల తీవ్రత కొద్ది రోజుల వరకూ తెలియలేదన్న బ్యూటీ.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు చిరాకు తెప్పించాయని, వాటి వెనుకున్న దుర్మార్గపు ఆలోచనల గురించి తెలుసుకుని కలత చెందినట్లు వెల్లడించింది. మహిళలు తమ శరీరాన్ని దాచుకోమని ఎవరైనా చెప్పినప్పుడు భరించలేని కోపం వస్తుందన్న అలియా.. 'బ్రా బయటకు కనిపించకూడదు. ఇంట్లో ఎలా పడితే అలా బెడ్‌పై పడేయకుండా లో దుస్తులు దాచిపెట్టాలి' వంటి మాటలు అస్సలు నచ్చవని చెప్పింది. చివరగా ఇప్పటికీ స్త్రీ తీవ్రమైన ద్వేషానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
Next Story






