- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల
ఏపీ పాలిసెట్-2026 ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. 1.48 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP POLYCET-2026) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,63,008 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, అందులో 1,48,950 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి లోకేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. సుమారు 91.37 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అవ్వడం విశేషం. ఏప్రిల్ 25న జరిగిన ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా చూసుకునేందుకు అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in/apssprc.aspx ను సందర్శించి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.






