- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. 46.9 డిగ్రీలతో దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు!
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అకోలాలో నమోదు! 46.9 డిగ్రీలతో మండిపోతున్న విదర్భ. మంగళవారం వరకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ.

దిశ, వెబ్ డెస్క్: ఈ సంవత్సరం మార్చి నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెలలో అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఎండలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం మొత్తం దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ (Department of Meteorology) హెచ్చరించింది. ఈ అలర్ట్ కు అనుగుణంగానే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ముఖ్యంగా అకోలా జిల్లాలో ఎండలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ ఏకంగా 46.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఇది ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత (highest temperature in the country)గా భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అకోలాతో పాటు అమరావతిలో 46.8 డిగ్రీలు, వార్ధాలో 46.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదవడంతో విదర్భలోని మెజారిటీ ప్రాంతాలు తీవ్రమైన వడగాల్పుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాష్ట్రంలోని విదర్భ రీజియన్‌లో మంగళవారం వరకు ఈ వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు రాకూడదని అధికారులు సూచించారు. అలాగే తెలంగాణలోని అనేక జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రామగుండం ప్రాంతం అధిక ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తుంది. దీంతో అధికారులు అలర్ట్ జారీ చేశారు. అవసరం ఉంటేనే ఇళ్ల నుంచి ప్రజలకు బయటకు రావాలని, తప్పని పరిస్థితుల్లో ఎండలో తిరిగేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.






