- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించాలి : ఏఐవైఎఫ్ డిమాండ్
ఇంటర్ విద్యార్థులకు ఫీజు చెల్లించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ఏఐవైఎఫ్ ఇంటర్ బోర్డు అధికారులను కోరింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్ష ఫీజు చెల్లింపునకు తక్షణమే అవకాశం కల్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఇంటర్ బోర్డు అధికారులను కోరింది. ఈ మేరకు ఏఐవైఎఫ్ ప్రతినిధులు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయకులు మాట్లాడుతూ అనేక ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. నిర్ణీత గడువులోగా విద్యార్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. కాలేజీల యాజమాన్యాల తప్పిదాలకు విద్యార్థులు పరీక్షలకు దూరం కావడం లేదా మానసిక ఒత్తిడికి గురవ్వడం సరికాదని పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమించి, అడ్మిషన్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు. సాంకేతిక కారణాల వల్ల లేదా కళాశాలల నిర్లక్ష్యం వల్ల ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులందరికీ మరోసారి అవకాశం కల్పించి, వారు పరీక్షలు రాసేలా చూడాలని కోరారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృథా కాకుండా ఇంటర్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.






