- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఆందోళనకరంగా గాలి నాణ్యత.. AQI 318గా నమోదు
నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసిన వాయు కాలుష్యం ప్రస్తుతం ఇతర నగరాల పై ప్రభావం చూపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: నిన్న మొన్నటి వరకు దేశ రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేసిన వాయు కాలుష్యం ప్రస్తుతం ఇతర నగరాల పై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నగరంలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. ఫిబ్రవరి 2 సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 318గా నమోదైంది. సాధారణంగా డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన కాలుష్య స్థాయిలు, చలికాలం ప్రభావంతో దట్టమైన పొగమంచు, వాహనాల ఉద్గారాలు తోడవ్వడంతో 'అత్యంత ప్రమాదకర' (Hazardous) స్థాయికి చేరుకున్నాయి.
ముఖ్యంగా తెల్లవారుజామున 6 నుండి 7 గంటల సమయంలో కాలుష్య తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో నగర ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వేగంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ ఇబ్బందులు, సైనసైటిస్, ఆస్తమా ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.






