- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు పీసీసీలతో AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే భేటీ.. రాహుల్ గాంధీ హాజరయ్యే చాన్స్!
ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యాలయం వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)తో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరుకాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) బలహీనపరుస్తోందని ఆరోపిస్తూ, దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక ఇటీవల రాహుల్ గాంధీ ఉపాధి హామీ కార్మికులతో నిర్వహించిన సమావేశం అనంతరం ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై పీసీసీ చీఫ్‌లకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు.
అదేవిధంగా జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశంపై ఈ భేటీలో డిస్కస్ చేయనున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై రాష్ట్రస్థాయిలో నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు. 2026లో జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఖర్గే, రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ప్రత్యేకంగా మానటరింగ్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఖర్గే సూచించారు. ఈ సమావేశంలో ప్రతి బూత్ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఎలా అప్రమత్తం చేయాలో పీసీసీ, సీఎల్పీలకు సూచనలు చేయనున్నారు.






