- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెక్నాలజీ వాడితే వ్యవసాయం లాభదాయకం: మాజీ మంత్రి హరీష్రావు
అమెరికాతో ఒప్పందం వల్ల సోయా, పత్తి రైతులకు నష్టం జరుగుతుందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో రైతుబంధు ఇవ్వాలని, టెక్నాలజీని అందించాలని డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రైతులు టెక్నాలజీ ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకం గా మారుతుందని, ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్రావు డిమాండ్చేశారు. కాంగ్రెస్రెండున్నర ఏళ్ల పాలనలో వ్యవసాయ యంత్రాల మీద సబ్సిడీ అనేది లేకుండా పోయిందని ఆరోపించారు. శనివారం ఎన్టీఆర్స్టేడియంలో ఏర్పాటు చేసిన అగ్రి షోకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలని ఆ భరోసాను గతంలో కేసీఆర్ కల్పించాడని గుర్తు చేశారు.
అమెరికాతో భారత ప్రభుత్వ ఒప్పందం తో రైతులకు తీవ్ర నష్టం జరగబోతుందని, ఆ ఒప్పందంలో సోయా, మక్కలు, పత్తి లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా దిగుమతి కానున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాదులో ఎక్కువ పండించే సొయా రైతుల పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మక్కలు ఎక్కువ పండించారని ఆ రైతుల పరిస్థితి ఏమిటని, మన రైతు పండించిన పంట ఖర్చు కంటే తక్కువకు అమెరికా మనకు దిగుమతి చేస్తే ఇక్కడి రైతు జీవితం అంధకారం అవుతుందన్నారు. రూ. 45 లక్షల కోట్ల విలువైన మొక్కజొన్న, పత్తి, సోయా అమెరికా మనకు పంపిస్తే ఈ దేశ రైతులు ఏం కావాలి విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25 శాతం టాక్స్ ఉండేదన్నారు.
ఇప్పుడు ఆ టాక్స్ 16 శాతానికి తగ్గించడంతో రూ. 25 వేలు ఉన్న పామాయిల్ టన్ను ధర రూ. 21 వేలకు పడిపోయింది. ఈ టాక్స్ తగ్గించడం ద్వారా మనకు ఏం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వం చేయవలసిన పని తెలుగు రైతు బడి రాజేందర్ రెడ్డి చేయడం అభినందనీయమన్నారు. దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది రైతులకు రకరకాల పంటల మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం యూరియా యాప్ పెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించాలని, పాస్ బుక్కు రెండు బస్తాలు ఇస్తే పట్టాలు లేని రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కొత్తగా భూములు కొనుక్కున్న వారికి పాస్ బుక్కులు రాక 8 నెలలు అవుతుందన్నారు. రైతు కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని, ఫిబ్రవరి 21 వచ్చినా ఇంకా రైతుబంధు రాలేదు. సకాలంలో రైతు బంధు వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పట్టుపురుగుల పెంపకంలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో ఉంది. తీర ప్రాంతాల్లోనే పండే ఆయిల్ పామ్ ఇప్పుడు తెలంగాణలో పండుతుంది. రైతు ఆదాయం పెంచడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను, కాలువలు తొవ్వించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరంతో కరువును పారదోలారు.
నేడు దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డదన్నారు. రైతులకు టెక్నాలజీ కావాలని కూలీలకు సంబందించిన సమస్య ఉందన్నారు. పంజాబ్ , ఝార్ఖండ్ , యూపీ, బీహార్ , ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి లేదన్నారు. బీహార్ నుంచి హమాలీలు వస్తే కానీ మన కల్లాల్లో ధాన్యం ఎత్తే పరిస్థితి లేదు, మిల్లులలో దించే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది మన రైతాంగానికి అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.






