Agent: ఏజెంట్ పోస్టర్ రిలీజ్.. సిగరేట్‌తో దర్శనం ఇచ్చిన అక్కినేని వారసుడు

by Dishanational2 |
Agent: ఏజెంట్ పోస్టర్ రిలీజ్.. సిగరేట్‌తో దర్శనం ఇచ్చిన అక్కినేని వారసుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్‌తో జోరుమీదున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈరోజు అఖిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అందులో అఖిల్ సిగరెట్ తాగుతూ దర్శనం ఇచ్చాడు. ఇక ఈ పోస్టర్‌ను చూసిన వారందరూ అఖిల్ గెటప్ సూపర్‌గా ఉందంటు ముచ్చటిస్తున్నారు. పొడవాటి జుట్టు, గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న అఖిల్‌లో ఇదే బెస్ట్ లుక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా, దేశభక్తి అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు12న విడుదల కానుంది. ఇందులో అఖిల్ ప్రేమ పాత్రలో కనిపించనుండగా, హీరోయిన్‌గా సాక్షివైద్య నటిస్తున్నారు.



Next Story

Most Viewed