అడివిశేష్ ఇంటెన్సివ్ లుక్.. వైరల్‌గా 'హిట్ 2' పిక్

by Disha Web Desk 12 |
అడివిశేష్ ఇంటెన్సివ్ లుక్.. వైరల్‌గా హిట్ 2 పిక్
X

దిశ, సినిమా : 'మేజర్' సినిమాతో సంచలనం సృష్టించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన యంగ్ హీరో అడివి శేష్.. మరొక మూవీతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. 'హిట్' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కనున్న 'హిట్ 2' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శేష్.. 'హిట్ 2' ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలవబోతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలో అడివి శేష్ చేతిలో గన్ పట్టుకుని ఇంటెన్సివ్‌ లుక్‌లో కనిపించడంతో.. ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందంటూ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మూవీలో శేష్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది.

Next Story

Most Viewed