Lava నుంచి సరికొత్త ఇయర్‌బడ్‌లు.. ధర రూ.1,299

by Harish |

దిశ,వెబ్‌డెస్క్: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ మంగళవారం తన కొత్త ..telugu latest news

Lava నుంచి సరికొత్త ఇయర్‌బడ్‌లు.. ధర రూ.1,299
X

దిశ,వెబ్‌డెస్క్: స్వదేశీ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ మంగళవారం తన కొత్త ట్రూ వైర్‌లెస్ (TWS) ఇయర్‌బడ్‌లు Lava Probuds21ను విడుదల చేసింది. ఇది ఒక్కసారి చార్జ్‌ చేస్తే 9 గంటల వరకు ప్లేబ్యాక్ టైంను అందిస్తోంది. లావా ఇ-స్టోర్, అమెజాన్‌లో వీటి ధర రూ.1,299. ఇది తేలికైనది, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. ఇది కస్టమర్లను ఖచ్చితంగా ఆకర్షిస్తుందని లావా ఇంటర్నేషనల్ హెడ్-ప్రొడక్ట్ తేజిందర్ సింగ్ తెలిపారు.

సరికొత్త ఇయర్‌బడ్‌లు కొత్త స్టెమ్ డిజైన్, 3 నెలల ఉచిత గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి థంపింగ్ బాస్‌తో హై డెఫినిషన్ సౌండ్‌ను అందిస్తాయి. ప్రోబడ్స్ 21 క్విక్ చార్జ్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కేవలం 20 నిమిషాల చార్జ్‌లో 200 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది. బడ్స్‌లో తాజా బ్లూటూత్ వెర్షన్ 5.1 కనెక్టివిటీ ఉంది. Google, Siriతో పాటు టచ్ కంట్రోల్ కూడా ఉంది. నీరు, చెమట నిరోధకత కోసం IPX4 రేటింగ్‌తో ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది.

Next Story