అదానీ పోర్ట్స్ సరికొత్త రికార్డు: 500 మిలియన్ టన్నుల కార్గో మార్కును దాటిన తొలి భారతీయ సంస్థ!

by Malleboina Mahesh |

అదానీ పోర్ట్స్ సరికొత్త చరిత్ర! ఒకే ఏడాదిలో 500 మిలియన్ టన్నుల కార్గో హ్యాండిల్ చేసిన తొలి భారతీయ సంస్థగా రికార్డు. 2030 నాటికి 1 బిలియన్ టన్నులే లక్ష్యం.

అదానీ పోర్ట్స్ సరికొత్త రికార్డు: 500 మిలియన్ టన్నుల కార్గో మార్కును దాటిన తొలి భారతీయ సంస్థ!
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ డెవలపర్, ఆపరేటర్ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) సరికొత్త రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 500 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMT) కార్గోను హ్యాండిల్ చేసిన తొలి భారతీయ పోర్ట్ ఆపరేటర్‌గా APSEZ చరిత్ర సృష్టించింది. 1998లో కేవలం ఒకే ఒక పోర్ట్‌తో ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తన పోర్ట్‌ల నెట్‌వర్క్ ద్వారా ఈ ఘనతను సాధించింది. మొదటి 100 మిలియన్ టన్నుల మార్కును చేరుకోవడానికి 16 ఏళ్లు పట్టగా, తర్వాతి ప్రతి 100 మిలియన్ టన్నుల అదనపు సామర్థ్యాన్ని అత్యంత వేగంగా అధిగమిస్తూ రావడం గమనార్హం. ప్రస్తుతం భారతదేశపు మొత్తం పోర్ట్ కార్గో వాల్యూమ్‌లలో ఈ సంస్థ 28 శాతం వాటాను కలిగి ఉంది.

ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, ఈ విజయం భారతదేశ వృద్ధి కథనంపై తమకున్న దశాబ్దాల నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. పోర్ట్‌లు కేవలం వాణిజ్య మార్గాలు మాత్రమే కాదని, అవి దేశపు ఆర్థిక ఆత్మవిశ్వాసానికి చిహ్నాలని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది సాధించిన 450 MMT రికార్డును అధిగమించి, ఈ ఏడాది 500 MMTకి చేరుకోవడం ద్వారా సంస్థ తన కార్యకలాపాల్లో అత్యుత్తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇదే ఉత్సాహంతో 2030 నాటికి 1 బిలియన్ టన్నుల (1000 MMT) కార్గోను హ్యాండిల్ చేయడమే లక్ష్యంగా APSEZ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో 850 MMT దేశీయ పోర్ట్‌ల నుండి, మిగిలిన 150 MMT అంతర్జాతీయ అసెట్స్ నుండి సాధించాలని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Next Story