- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'పుష్ప' పార్ట్2లో సమంత.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
by Javid Pasha |
దిశ, సినిమా : ‘పుష్ప’ మూవీ ఫ్యాన్స్‌కు త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్ అందించనున్నారు మేకర్స్.. Latest Telugu News..

X
దిశ, సినిమా : 'పుష్ప' మూవీ ఫ్యాన్స్‌కు త్వరలోనే అదిరిపోయే అప్‌డేట్ అందించనున్నారు మేకర్స్. సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మొదటి భాగం భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు 'పార్ట్ 2' కోసం భారీ కసరత్తులు చేస్తున్నాడు దర్శకుడు. కాగా ఇందుకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా నటించిన రష్మిక 'శ్రీవల్లి' పాత్రలో ఆకట్టుకోగా.. 'ఊ అంటావా మావా' ఐటెం సాంగ్‌తో సమంత అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామ్ బ్రాండ్ సెకండ్ పార్ట్‌కు మరింత ప్లస్ అవుతుందని భావించిన మేకర్స్.. ఆమె కోసం కీ రోల్ క్రియేట్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి సమంతతో చర్చలు కూడా పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం.
Next Story






