ఆయనతో నటించడం నా అదృష్టం.. కేరళ కుట్టి

by Dishafeatures2 |
ఆయనతో నటించడం నా అదృష్టం.. కేరళ కుట్టి
X

దిశ, సినిమా: యంగ్ హీరో రాజ్‌తరుణ్‌‌కు జోడిగా 'లవర్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది కేరళ కుట్టి రిద్ధి కుమార్. అందం అభినయంతో పాటు మంచి ఫిజిక్ మెయింటెన్ చేసే ఈ భామ.. అనతికాలంలోనే మంచి గుర్తింపు పొందింది. అయితే ఆ తర్వాత అడపాదడపా సినిమా అవకాశాలు రావడంతో పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ సత్తా చాటిన రిద్ధి.. ఇప్పుడూ పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్‌'లో ఓ కీలక పాత్రలో కనిపించడంపై సంతోషం వ్యక్తం చేస్తోంది. 'పూణేలో డిగ్రీ పూర్తిచేసిన తర్వాత సినిమాల్లో నటించాలని ఫిక్స్ అయ్యాను. అందుకు తగ్గట్టే మోడలింగ్‌లో ప్రవేశించి అక్కడి నుంచి తెలుగు సినిమాతో నా కెరీర్ ప్రారంభించాను.

రాధేశ్యామ్ సినిమాలో స్పోర్ట్ విమెన్‌గా కనిపించబోతున్న. పాత్ర కోసమే ఆ ఆట నిజంగా నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రభాస్ లాంటి హీరోతో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులు నా పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అంటూ వివరించింది. అలాగే తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది రిద్ధి కుమార్.

Next Story

Most Viewed