పెద్ద హీరో చెయ్యి పడ్డా కలిసి రావట్లే.. యంగ్ బ్యూటీ

by Disha Web Desk 12 |
పెద్ద హీరో చెయ్యి పడ్డా కలిసి రావట్లే.. యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా : తమిళ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్.. తెలుగులో నాని సరసన నటించిన మొదటి సినిమా 'గ్యాంగ్ లీడర్' తో మంచి మార్కులు కొట్టేసింది. ఈ క్రమంలోనే శర్వానంద్‌‌కు జోడీగా 'శ్రీకారం' చిత్రంలో చాన్స్ దక్కించుకున్న భామకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తమిళ్‌లో మాత్రం బిగ్‌స్టార్స్‌తో వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది శివ కార్తికేయన్‌తో 'డాక్టర్' సినిమాలో నటించి హిట్ అందుకున్న ప్రియాంక.. ప్రస్తుతం స్టార్ హీరో సూర్య నటించిన 'ఈటీ' మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. 'సినిమాల్లో మన క్యారెక్టర్‌కు వందశాతం న్యాయం చేసినా అదృష్టం లేకపోతే స్టార్‌డమ్ సంపాదించలేం. తెలుగులో నటించిన రెండు సినిమాల్లో నటిగా మంచి మార్కులే పడ్డాయి. కానీ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు చిన్న సినిమాతోనే స్టార్ స్టేటస్ సొంతమైతే.. ఇంకొన్నిసార్లు పెద్ద హీరోతో చేసినా స్టార్‌‌డమ్ దక్కట్లేదు' అంటూ చెప్పుకొచ్చిన నటి.. ఇలాంటి సమయంలోనే అదృష్టాన్ని నమ్ముకోవాల్సి వస్తుందని సెలవిస్తోంది.

Next Story

Most Viewed