'రాధే శ్యామ్' స్టోరీ చెప్పేసిన పూజ.. జ్యోతిష్యం పవర్‌ అంటూ

by Disha Web Desk 17 |
రాధే శ్యామ్ స్టోరీ చెప్పేసిన పూజ.. జ్యోతిష్యం పవర్‌ అంటూ
X

దిశ, సినిమా: 'రాధే శ్యామ్‌' మూవీ ప్రమెషన్‌లో భాగంగా ప్రభాస్‌, పూజా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటునే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన పూజా.. ఈ సినిమాలో తన పాత్రలో చాలా షేడ్స్‌ ఉన్నాయని, కెరీర్‌లో సవాల్‌తో కూడుకున్న పాత్రల్లో ఇదొకటంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'గత నాలుగేళ్ల నుంచి ఈ మూవీ పాత్రతో కనెక్ట్‌ అయి ఉన్నాను. కెరీర్‌లో మొదటిసారి ఎక్కువ రీసెర్చ్‌ చేసిన పాత్ర ఇదే. ఇందుకోసం చాలా బుక్స్‌ చదివాల్సి వచ్చింది. ప్రేరణ పాత్రకి నా బెస్ట్‌ ఇచ్చాను. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా' అంటూ ధీమా వ్యక్తం చేసింది. అలాగే ఈ స్టోరీ అంతా జ్యోతిష్యం నేపథ్యంలో సాగుతుందన్న పూజా.. 'భారతీయ సంస్కృతి చాలా గొప్పది. జ్యోతిష్యంలో ఏదో ఓ పవర్‌ ఉంది. నిజ జీవితంలో నేను జ్యోతిష్యాన్ని సైన్స్‌గానే భావిస్తాను' అంటూ ప్రభాస్ హైట్‌కు తన ఎత్తు మ్యాచ్ అవ్వడంతో జోడీ బాగుందని చెబుతున్నారంటోంది పూజా.


Next Story

Most Viewed