- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రష్యా, ఉక్రెయిన్ వార్: ప్రముఖ నటి మృతి..

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. రష్యా బాంబులు, మిస్సైల్స్ దాడులతో ఉక్రెయిన్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఇరు దేశాల అధినేతలు ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం ఇప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించిన.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రష్యా సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. అయితే.. రష్యా సైనికులు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై ఇటీవల భయంకరమైన రాకెట్ బాంబుల దాడి చేశారు. ఈ దాడిలో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఒక్సానా 'ది సీక్రెట్ ఆఫ్ సెయింట్ పాట్రిక్, టుమారో విల్ బీ టుమారో చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. అంతేగాకుండా ఉక్రెయిన్‌లోని ప్రతిష్టాత్మక మెరిటెడ్ ఆర్టిస్ట్ అవార్డ్‌ను ఆమె గెలుచుకున్నారు.
Next Story