- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఛావా చిత్రం.. మహాకుంభమేళాను సందర్శించుకున్న నటి కత్రినాకైఫ్ ఫ్యామిలీ
తాజాగా కత్రినా కైఫ్ (Katrina Kaif) మహా కుంభమేళా(Kumbh Mela)ను దర్శించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా కత్రినా కైఫ్ (Katrina Kaif) మహా కుంభమేళా(Kumbh Mela)ను దర్శించుకుంది. అక్కడ ఈ నటి కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద పవిత్ర స్నానం ఆచరించారు. అంతేకాకుండా వీరు ప్రయాగ్ రాజ్(Prayag Raj)లోని సాధువులు ఆశీర్వచనాలు కూడా తీసుకున్నారు. సాధువులు కత్రినా కైఫ్ కు మెడలో దండ వేసి స్వాగతించారు. అలాగే కాసేపు ఈ నటి సాధువులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ ను చూసిన జనాలు ఒక్కసారిగా సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.
ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను ఈ నటి వివాహమాడిన విషయం తెలిసిందే. తాజాగా విక్కీ కౌశల్ కీలక పాత్రలో నటించిన ఛావా (Chava) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవడంతో కత్రినా ఫ్యామిలీ ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా జరిగే మహాకుంభమేళాను సందర్శించుకున్నారు సమాచారం. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక కథానాయిక (National Crush Rashmika is the heroine) కీలక పాత్రలో నటించింది.
మహారాణి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే కత్రినా కైఫ్ అండ్ విక్కీ కౌశల్ తరచూ ప్రముఖ పుణ్య క్షేత్రాల్ని దర్శించుకుంటారన్న విషయం తెలిసిందే. రీసెంట్‌గానే విక్కీ, కత్రినా.. అలాగే తల్లిదండ్రులతో కలిసి ఛావా సినిమా ప్రీమియర్‌కు వెళ్లారు. మూవీ వీక్షించిన అనంతరం విక్కీ పేరెంట్స్ చాలా గర్వంగా ఫీల్ అయి.. ప్రశంసించారు.






