- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరూర్ తొక్కిసలాట కేసు: ఢిల్లీలో సీబీఐ ముందు విచారణకు హాజరైన నటుడు విజయ్
తమిళ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తమిళ హీరో, టీవీకే అధ్యక్షుడు విజయ్ (Vijay) పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఢిల్లీలోని సీబీఐ (CBI) ప్రధాన కార్యాలయంలో రెండోసారి హాజరయ్యారు. సెప్టెంబర్ 2025లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రధానంగా విజయ్ రాక ఏడు గంటల పాటు ఆలస్యం కావడం వల్ల జనం ఒక్కసారిగా పెరిగి తొక్కిసలాట జరిగిందా? అనే కోణంలో అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో బస చేసిన విజయ్, భారీ భద్రత నడుమ అధికారుల ముందుకు వెళ్లారు.
ఈ విచారణలో భాగంగా విజయ్ ప్రయాణించిన ప్రచార వాహనం కదలికలు, పార్టీ కార్యకర్తలు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకున్నారా లేదా అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే గత వారం జరిగిన మొదటి విడత విచారణలో విజయ్ సుదీర్ఘంగా సమాధానాలు ఇవ్వగా, నేటి విచారణలో ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, బాధ్యుల వివరాలపై సీబీఐ ఆరా తీస్తోంది. దట్టమైన జనసమూహం ఉన్న చోట కనీస వసతులు కల్పించడంలో జరిగిన లోపాలను కూడా అధికారులు ప్రశ్నావళిలో చేర్చినట్లు సమాచారం. ఈ విచారణ అనంతరం సీబీఐ అధికారులు తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో విజయ్ వరుసగా సీబీఐ విచారణకు హాజరవ్వడం తీవ్ర చర్చకు దారి తీస్తుంది.






