Surya: ఆస్కార్ కమిటీ సభ్యుడిగా సూర్య.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్

by Manoj |   (  Updated:2022-09-16 13:37:04  IST  )

Actor Surya has been Invited to Join Oscar as Committee Member| సూపర్ స్టార్ సూర్యకు ఆస్కార్ అకాడమీ నుంచి ఇన్విటేషన్ అందింది. ఆస్కార్ ఆర్గనైజర్స్ మెంబర్‌గా ఉండాలని అకాడమీ ఆయనను కోరడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Actor Surya has been Invited to Join Oscar as Committee Member
X

దిశ, సినిమా : Actor Surya has been Invited to Join Oscar as Committee Member| సూపర్ స్టార్ సూర్యకు ఆస్కార్ అకాడమీ నుంచి ఇన్విటేషన్ అందింది. ఆస్కార్ ఆర్గనైజర్స్ మెంబర్‌గా ఉండాలని అకాడమీ ఆయనను కోరడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మంగళవారం 397 మంది ఆర్టిస్టులు, ఎగ్జిక్యూటివ్స్‌కు ఈ ఆహ్వానం పంపించగా.. ఈ జాబితాలో సౌత్ ఇండస్ట్రీ నుంచి సూర్య ఉండటం విశేషం.

ఇప్పటికే సూర్య నటించిన 'సూరారై పోట్రు'.. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిషియన్, బెస్ట్ రైటర్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ కావడం తెలిసిందే. మొత్తం 366 సినిమాల్లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించిన బెస్ట్ ఫిల్మ్ ఇదే కాగా.. సూర్య 'జై భీమ్' కూడా ఆస్కార్ అఫిషియల్ యూట్యూబ్ పేజ్‌లో ప్రదర్శితమవడం విశేషం. ఈ రెండు చిత్రాలకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్న సూర్యను ఆస్కార్ కమిటీ ఈ విధంగా సత్కరిస్తోందని అంటున్న అభిమానులు.. సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు.

Next Story