- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరంగల్ కోటలో యాక్టర్ సుమన్ సందడి.. అద్భుత కోట అంటూ కితాబు..
by Satheesh |
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ పర్యటనకు వచ్చిన సినీ నటుడు సుమన్ ఆదివారం ఖిలా వరంగల్ కోటను స్థానిక- latest Telugu news

X
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ పర్యటనకు వచ్చిన సినీ నటుడు సుమన్ ఆదివారం ఖిలా వరంగల్ కోటను స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయ కళలకు వరంగల్ సంపద అన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా పేరున్న వరంగల్ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. వేయి స్తంభాల గుడి, భద్రకాళి దేవాలయంతో పాటు మరెన్నో పర్యాటక క్షేత్రాలు ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి.. తగిన వసతులు ఏర్పాటు చేస్తే దేశ, విదేశాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ బోగి సురేష్, బైరబోయిన ఉమ దామోదర్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Next Story






