నటుడు శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 33వ సర్ సీవీ రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 500 పైగా పాఠశాలల నుండి 50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

నటుడు శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 33వ సర్ సీవీ రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 500 పైగా పాఠశాలల నుండి 50,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించన 33వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో పాల్గొన్నారు. 20 మందికి గోల్డ్ మెడల్స్, 20 మంది కి నేషనల్ ర్యాంక్స్, 20 మందికి రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు 450 మందికి జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చాయి. ఈ యువ టాలెంటెడ్ విద్యార్థులకు రవీంద్రభారతిలో మంగళవారం అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, చింతమనేని ప్రభాకర్, సినీనటులు శ్రీకాంత్, శివాజీ రాజా మరియు సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహాయం చేసే గొప్ప ఈ గుణం అందరికీ ఉండాలన్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. గత 33 సంవత్సరాలుగా ఈ మహాకార్యానికి లయన్ కిరణ్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు తెలుగు రాష్ట్రలో అన్ని కలలకి అన్ని సంస్కృతులకు అన్ని సంప్రదాయాలకి ఈ ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులకు మంచి చేయాలి అనే ఉదేశ్యంతో ఈ కార్యక్రమం నిరంతరం చేయాలన్నారు.

Next Story