- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాల్పుల కేసు.. నటుడు కమల్ ఆర్ ఖాన్ అరెస్ట్
బాలీవుడ్ యాక్టర్ నిర్మాత కమల్ ఆర్ ఖాన్ (KRK) నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ యాక్టర్ నిర్మాత కమల్ ఆర్ ఖాన్ (KRK) నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా అంధేరిలోని ఓషివారా ప్రాంతంలో గల ఒక నివాస భవనం పై కాల్పులు జరిపినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జనవరి 18న జరిగిన ఈ ఘటనపై లోతైన విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఆయనను శనివారం (జనవరి 24, 2026) తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో KRK తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.
తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌ను శుభ్రం చేసిన తర్వాత, అది సరిగ్గా పనిచేస్తుందో లేదో పరీక్షించడానికి (Functionality Check) తన ఇంటికి ఎదురుగా ఉన్న మడ అడవుల (Mangroves) వైపు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఆ సమయంలో వీచిన బలమైన గాలుల వల్ల బుల్లెట్లు దారి తప్పి సమీపంలోని 'నలంద' సొసైటీ భవనాన్ని తాకాయని ఆయన వివరించారు. ఎవరినీ గాయపరచాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన పోలీసులకు తెలిపారు.
ఈ కాల్పుల వల్ల భవనంలోని రెండో అంతస్తులో నివసించే రైటర్-డైరెక్టర్ నీరజ్ కుమార్ మిశ్రా, నాలుగో అంతస్తులోని మోడల్ ప్రతీక్ బైద్ ఫ్లాట్‌ల గోడలు, కిటికీలకు బుల్లెట్లు తగిలాయి. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా కాల్పులు KRK నివాసం నుండే జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు.






