- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గంగులపై పోటీకి కార్యకర్తలు చాలు.. బండి ఎందుకు..?
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు దమ్ముంటే మంత్రి గంగులపై పోటీ చేసి గెలవాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసరడంపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈమేరకు గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాల్లో ఆరితేరిన గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకని, గంగులను ఓడించేందుకు సామాన్య కార్యకర్త చాలంటూ సెటైర్లు వేశారు. ఈసారి చిత్తుచిత్తుగా ఓడించి తీరుతామని, అధికారం, అహంకారం, డబ్బు మదాన్ని దించుతామని వారు హెచ్చరించారు. తెలంగాణకు కేంద్రం నయాపైసా ఇవ్వడం లేదని, బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీగా ఉంటూ మూడేళ్లుగా కనీసం రూ.3 కోట్లు కూడా తేలేకపోయారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు.
అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ తండ్రినే మించిపోయాడని చురకలంటించారు. కేటీఆర్మాటలకు, చేతలకు పొంతనలేని దద్దమ్మ అంటూ విమర్శలు చేశారు. కేంద్రంపై ఏడవటం తప్పా టీఆర్ఎస్రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చుపెట్టే నిధులన్నీ కేంద్రానివేనని వారు తెలిపారు. ఈ విషయాలన్నీ గణాంకాలతో సహా వివరించేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని టీఆర్ఎస్‌కు సవాల్విసిరారు. బండి సంజయ్ పేరు వింటేనే తండ్రీ కొడుకుల వెన్నులో వణుకుపుడుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.