ఆయనే నాకు రొమాన్స్ నేర్పించారు.. మలయాళ యంగ్ బ్యూటీ

by Javid Pasha |

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా తను నటించిన.. Latest Telugu News..

ఆయనే నాకు రొమాన్స్ నేర్పించారు.. మలయాళ యంగ్ బ్యూటీ
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్‌ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా తను నటించిన 'మారన్‌' చిత్రం మార్చి 11న విడుదల కానున్న నేపథ్యంలో ఓ కార్యక్రమానికి హాజరైన నటి.. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు వెల్లడించింది. విజయ్‌ సరసన నటించిన 'మాస్టర్‌' చిత్రంతో తన కెరీర్ మారిపోయిందన్న ఆమె.. మారన్‌ చిత్రంలో ధనుష్‌తో నటించే అవకాశం రావడం ఆద‌ృష్టంగా భావిస్తున్నానంటోంది. అయితే ఈ మూవీలో తనను సెలక్ట్ చేసేందుకు ముఖ్య కారణం ధనుష్ అని చెప్పిన మాళవికా.. రొమాన్స్‌, కామెడీ, డ్రామా, సెంటిమెంట్‌, భావోద్వేగాలను పండించేదుకు అన్ని విధాలుగా సహకరించాడని, ఆయనొక 'మాస్టర్‌ పీస్‌' అంటూ పొగిడేసింది. అలాగే ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదలైతే బాగుండేదన్న నటి.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపింది. ఇక కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించిన 'మారన్' సత్యజ్యోతి బ్యానర్‌పై టీజీ త్యాగరాజన్‌ నిర్మించగా మార్చి 11 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Next Story