మహిళా బంధు కార్యక్రమానికి వెళ్తుంటే..

by Vinod kumar |

దిశ, మణుగూరు: మహిళా బంధు కార్యక్రమానికి - Accident in Khammam district

మహిళా బంధు కార్యక్రమానికి వెళ్తుంటే..
X

దిశ, మణుగూరు: మహిళా బంధు కార్యక్రమానికి వెళ్తున్న ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో పలువురు మహిళలు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మండలంలోని మార్కెట్ యార్డ్ గోడంలో నియోజకవర్గ స్థాయి మహిళా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి, మహిళ బంద్ కార్యక్రమాలు నిర్వహించారు.

అయితే ఈ కార్యక్రమానికి అశ్వాపురం మండలం మనుబోతులగూడెం నుంచి 20 నుంచి 30 మంది మహిళలు ట్రాక్టర్ లో వస్తుండగా.. మణుగూరు మండలం అశోక్ నగర్ మసీదు వద్ద ట్రాక్టర్ లింక్ విరగడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికుల సహాయంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళలను పరీక్షించిన డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. ఏది ఏమైనా మహిళా దినోత్సవం రోజున ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరమని స్థానికులు అంటున్నారు.

Next Story