- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఇవాళ తెల్లవారజామున చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైపాస్ మలుపు వద్ద సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుండగా.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు టైల్స్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డీసీఎంలో ఉన్న టైల్స్ అన్ని అందులో ఉన్న కూలీలపై పడటంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story






